రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలలోని ‘ట్రిప్టోఫాన్’, ‘మెలటోనిన్’ నిద్రలేమిని తగ్గిస్తాయి. అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా, కనీసం 45 నిమిషాల నుంచి గంట గ్యాప్ ఇచ్చి పాలు తాగడం మంచిది. గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు తాగకపోవడమే మంచిదంటున్నారు.