• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘గోటీల ఫ్యాక్టరీ’ వార్తలపై రాజశేఖర్ క్లారిటీ

గోటీల వ్యాపారంతో నటుడు రాజశేఖర్ రూ.3 కోట్లు-4 కోట్లు సంపాదిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాజశేఖర్  స్పందించాడు. అందులో నిజం లేదని, తనకు గోటీల ఫ్యాక్టరీ లాంటిది లేదని స్పష్టం చేశాడు. అలాంటి ఆలోచన కూడా లేదని, ఎవరో కావాలని క్రియేట్ చేశారని చెప్పాడు. ముఖ్యంగా వార్తలను చూసి నవ్వుకున్నానని తెలిపాడు.

March 14, 2026 / 02:58 PM IST

‘ఉస్తాద్‌’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక ఖరారైంది. మార్చి 15న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు.

March 14, 2026 / 02:52 PM IST

‘సిగ్మా’ విడుదలపై సందిగ్ధత.!

విజయ్ దళపతి తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, విజయ్ రాజకీయ పార్టీ పనులు, వ్యక్తిగత పరిణామాల వల్ల మేకర్స్ వెనక్కి తగ్గారట. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రశ్నలు జేసన్‌ను ఇబ్బంది పెడతాయని భావించి, అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విడుదల చేయాలని చూస్తున్నారట.

March 14, 2026 / 02:25 PM IST

ఆస్కార్‌లో నో ఫోన్‌.. నో ఫుడ్‌.. ఈ రూల్స్‌ ఎవరికంటే..?

ఆస్కార్ వేడుకల్లో సీట్ ఫిల్లర్స్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. సెలబ్రిటీలు తమ సీట్ల నుంచి లేచినప్పుడు ఆ ఖాళీలు కనిపించకుండా వారు కూర్చుంటారు. వీరు కఠిన నియమాలు పాటించాలి. ప్రయాణ, వ్యక్తిగత ఖర్చులు సొంతంగానే భరించాలి. ఫోన్లు వాడకూడదు, లోపల తినడానికి లేదా నీళ్లు తాగడానికి అనుమతి ఉండదు. నిర్దేశించిన డ్రెస్ కోడ్ పాటించాలి. సెలబ్రిటీలు మాట్లాడిస్తే తప్ప వారితో సంభాషించకూడదు.

March 14, 2026 / 01:55 PM IST

మళ్లీ తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది. ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో నెటిజన్లు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో జరగ్గా.. ఇప్పటికే వారికి ఒక బాబు ఉన్నాడు.

March 14, 2026 / 01:46 PM IST

HYDలో ‘ధురంధర్ 2’ బుకింగ్స్ సెన్సేషన్

హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న హంగామా మామూలుగా లేదు. మార్చి 19న విడుదల కానున్న ఈ బాలీవుడ్ చిత్రం, టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాల రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. బుక్‌మైషోలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో అప్పుడే పలు థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ అన్-స్టాపబుల్ క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.

March 14, 2026 / 01:39 PM IST

ట్రోలర్స్‌కు అల్లు శిరీష్ స్ట్రాంగ్ కౌంటర్

మెగా హీరో అల్లు శిరీష్ తన పెళ్లిలో ‘చోకర్’ ధరించడంపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. నగలు ధరించడం మన భారతీయ సంస్కృతిలో భాగమేనని, మహారాజులు కూడా భారీ హారాలు వేసుకునేవారని గుర్తుచేశాడు. ‘2026లో ఉన్నాం, నా స్టైల్ ఏంటో నాకు తెలుసు. ఇతరుల మాటలు వినాల్సిన అవసరం లేదు’ అంటూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.

March 14, 2026 / 01:33 PM IST

‘కరుప్పు’ విడుదలపై నయా అప్‌డేట్

RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా విడుదలపై నయా అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.

March 14, 2026 / 01:22 PM IST

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై నయా UPDATE

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే జోర్డాన్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం.. కొత్త షెడ్యూల్‌‌ను మార్చి 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

March 14, 2026 / 12:38 PM IST

అజిత్‌కు మహీంద్రా స్పెషల్ గిఫ్ట్

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌కు రేసింగ్‌పై ఉన్న మక్కువను గౌరవిస్తూ మహీంద్రా సంస్థ సరికొత్త ‘BE 6’ ఫార్ములా ఈ-థీమ్ SUVని బహుమతిగా అందించింది. ప్రపంచంలోనే మొదటి ఈ-థీమ్ ఎస్యూవీగా నిలిచిన దీని విలువ సుమారు రూ.30 లక్షలుగా సమాచారం. మహీంద్రా ఆటో హెడ్ వేలుస్వామి స్వయంగా ఈ కారును అజిత్‌కు అందజేశాడు. ఈ ప్రత్యేక లాంచ్ కార్యక్రమంలో అజిత్ పాల్గొని సందడి చేశాడు.

March 14, 2026 / 12:10 PM IST

‘కాంచన’ రీ-రిలీజ్.. భారీ ఓపెనింగ్స్‌!

నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. 2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ కాగా.. భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రూ.3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.

March 14, 2026 / 11:50 AM IST

‘విశ్వంభర’ విడుదలపై లేటెస్ట్ బజ్

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ విడుదలపై సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్ నడుస్తోంది. తొలుత 2025 సంక్రాంతికి అనుకున్నా, VFX పనుల వల్ల మూవీ ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని ఈ చిత్రాన్ని 2026 చివరి నాటికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

March 14, 2026 / 11:42 AM IST

అతని పతనం కోసం ఎదురుచూస్తున్నారు: RGV

రామ్ గోపాల్ వర్మ మరోసారి ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రం భారతీయ సినిమాలో విప్లవం తెచ్చిందని, మేకింగ్ శైలిని మార్చేసిందని అన్నాడు. అయితే, దీనివల్ల పెరిగిన బడ్జెట్ భారంతో ఇండస్ట్రీ ఆయనపై కోపంగా ఉందని, ఆదిత్య-యామీ గౌతమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతారా అని అందరూ చూస్తున్నారని, కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని వర్మ హెచ్చరించాడు.

March 14, 2026 / 10:40 AM IST

కొరియా వీధుల్లో వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘కొరియన్ కనకరాజు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ రేపటి నుంచి కొరియాలో ప్రారంభం కానుంది. ఈ లోపు దొరికిన చిన్న విరామంలో వరుణ్ అక్కడ స్థానిక కొరియన్లతో ముచ్చటిస్తూ సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

March 14, 2026 / 10:16 AM IST

అందుకే ‘ధురంధర్ 2’ను వదులుకున్నా: అనిల్

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘ధురంధర్ 2’. ఈ సినిమాలో అతిథిపాత్ర కోసం చిత్రబృందం అనిల్ కపూర్‌ను సంప్రదించగా.. అతడు నో చెప్పాడట. దీనిపై తాజాగా అనిల్ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఆ మూవీలో నటించాలని నేనూ కోరుకున్నా. కానీ, అప్పటికే మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చేశాను. దీంతో ‘ధురంధర్ 2’లో నటించలేకపోయాను’ అని చ...

March 14, 2026 / 10:00 AM IST