వరుస పరాజయాల నేపథ్యంలో రాశీ ఖన్నా తన ఆశలన్నీ ఓటీటీపైనే పెట్టుకుంది. ర్యాపర్ కింగ్ హీరోగా పరిచయమవుతున్న ‘లుఖ్కే’ అనే మ్యూజికల్ యాక్షన్ డ్రామాలో ఆమె నటిస్తోంది. పంజాబ్ ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌తోనైనా రాశీ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుకకు సంబంధించి మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. రష్మిక విధించిన షరతు మేరకు పెళ్లి రోజున కేవలం గంటన్నర లోపే మేకప్‌ను పూర్తి చేసినట్లు తన్వీ తెలిపింది. సాధారణంగా సెలబ్రిటీల మేకప్‌కు గంటల సమయం పడుతుంది. కానీ రష్మిక ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయించుకోవడం విశేషం.
‘లిటిల్ హార్ట్స్’ విజయంతో జోరుమీదున్న హీరో మౌళి, తన తదుపరి మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌తో చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీకి ‘దొంగ నా కొడుక’ అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ క్రేజీ ప్రాజెక్టు మౌళి కెరీర్‌కు మరో బిగ్ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రాశీఖన్నా, పలక్ తివారీ ప్రధాన పాత్రల్లో హిమాంక్ గౌర్ తెరకెక్కించిన మ్యూజికల్ యాక్షన్ డ్రామా ‘లుఖ్కే’. పంజాబ్ ర్యాప్ కల్చర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. డ్రగ్స్ సిండికేట్ గుట్టు విప్పేందుకు ఓ క్రీడాకారుడు ర్యాపర్ అవతారమెత్తడం ఇందులో కీలకాంశం. మొత్తం 8 ఎపిసోడ్లతో ఈ సిరీస్ అలరించనుంది.
మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్, దర్శకుడు పాల్ జార్జ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కట్టలాన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 15న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ సాలిడ్ పోస్టర్ షేర్ చేశారు. ఇక దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ 2026 మేలో రిలీజ్ కానుంది.
‘డెకాయిట్’ మూవీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని చూసి చాలా ఎంజాయ్ చేశానని పోస్ట్ పెట్టాడు. ‘అడివి శేష్ హరిగా సాలిడ్ అండ్ మర్చిపోలేని పెర్ఫార్మెన్స్‌ని అందించాడు. మృణాల్ తన రోల్‌కి డెప్త్ తీసుకొచ్చింది. అనురాగ్ కశ్యప్ ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు’ అని పేర్కొన్నాడు. దీనిపై ‘డెకాయిట్’ టీం స్పందిస్తూ థ్యాం...
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. తాజాగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మాణంలో దర్శకుడు శరవణన్ రూపొందించనున్న భారీ చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం శివన్న చేతిలో పెద్ది, గుమ్మడి నర్సయ్య, ఉత్తరకాండ, 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ వంటి ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో రాబోయే మూవీపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి విజయవాడలోనే ఉండి ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యాడట. ఈ మూవీ కోసం అమరావతిలో ప్రత్యేకంగా ఒక ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాడట. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమై, పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా మెప్పించిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు టాక్.
టాలీవుడ్‌లో పీరియాడిక్ మూవీల హవా నడుస్తోంది. మాస్ మసాలా కంటే గత కాలపు విజువల్ వండర్స్‌కే ప్రేక్షకులు జై కొడుతున్నారు. దీంతో ప్రభాస్, NTR, చరణ్ వంటి స్టార్లు పురాణాలు, వీరగాథల వైపు మొగ్గు చూపుతున్నారు. వందల కోట్ల బడ్జెట్, భారీ VFXతో మేకర్స్ పాత కాలపు వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ వైవిధ్యమైన కథలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి చిరంజీవి నుంచి కేవలం సినిమా వారసత్వాన్ని మాత్రమే కాకుండా, అంకితభావంతో పనిచేసే తత్వాన్ని కూడా నేర్చుకున్నానని తెలిపాడు. ‘మిగిలిన వారు 50 గంటలు కష్టపడితే, నువ్వు 100 గంటలు కష్టపడాలి’ అన్న తండ్రి మాటలే తన విజయ సూత్రమని చెప్పాడు. నటుడిగానే కాకుండా, బాధ్యతగల తండ్రిగా ఉండటమే ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యమని తెలిపాడు.
జూ. ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు మేకర్స్ ఆమెను సంప్రదించారట. అంతేకాదు అలియా కోసం ఒక కీలకమైన, కథను మలుపు తిప్పే పాత్రను నీల్ డిజైన్ చేసినట్లు సమాచారం. కాగా, గతంలో ఎన్టీఆర్, అలియా కలిసి ‘RRR’ మూవీ కోసం వర్క్ చేసిన విషయం తెలిసిందే.
ప్రముఖ గాయని K.S చిత్ర తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా SMలో చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కలిచివేస్తోంది. 2011లో దుబాయ్‌లో జరిగిన ప్రమాదంలో తన ఏకైక బిడ్డను కోల్పోయిన చిత్ర.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ‘బిడ్డ లేని లోటు ఎప్పటికీ తీరనిది, నీ జ్ఞాపకాలు నా గుండెల్లో నిరంతరం ఉంటాయి’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.
నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘అస్సీ’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ OTT సంస్థ జీ5లో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాధితులపై చూపే వివక్షను ఈ సినిమాలో చూపించారు.
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ మూవీ OTT డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను జీ5 భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను సింగర్ మంగ్లీ కలిసి, అడ్వకేట్ సుబ్బారావుపై ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై తన సోదరుడిపై నమోదైన కేసు నేపథ్యంలో, సుబ్బారావు ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ వివాదంతో తనకు సంబంధం లేదని, తనను టార్గెట్ చేస్తున్న సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగ్లీ సీపీని కోరింది.