• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

పవన్ కళ్యాణ్, వి.వి. వినాయక్ కాంబోలో సినిమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబోలో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనిపై వినాయక్ స్పందిస్తూ.. పవన్‌తో సినిమా చేయాలనే బలమైన కోరికతో ఒక కథను సిద్ధం చేసి, కొన్ని రోజులు వర్క్ కూడా చేశానని వెల్లడించాడు. కానీ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని అన్నాడు.

April 13, 2026 / 04:00 PM IST

‘నాగబంధం’సెకండ్ సింగిల్‌పై అప్‌డేట్

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాగా.. తాజాగా సెకండ్ సింగిల్‌పై అప్‌డేట్ వచ్చింది. ‘సుర సుర’ అంటూ సాగే ఈ పాట ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. ఇక 2026 జూలై 3న విడుదల కానున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

April 13, 2026 / 03:30 PM IST

కాశీ సాధువుల్లో క్రిమినల్స్ ఉన్నారు: హీరో

‘మిస్టర్ ఎక్స్’ సినీ ప్రమోషన్స్‌లో హీరో ఆర్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాశీలోని సాధువులందరూ నిజాయితీపరులు కాదని, కొందరు క్రిమినల్స్ సాధువుల వేషంలో అక్కడ దాక్కుంటారని అన్నాడు. వారికి ఎలాంటి గుర్తింపు పత్రాలు ఉండవని, పోలీసులు కూడా తమ షూటింగ్ సమయంలో ఆయుధాలు కలిగిన నకిలీ సాధువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు వెల్లడించాడు.

April 13, 2026 / 03:10 PM IST

విశ్వక్ సేన్ కొత్త మూవీ షురూ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ‘దేవ్’ ఫేమ్ రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్నాడు. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘దేవర’ వంటి గ్లోబల్ హిట్ అందించిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కీలినేని సుధాకర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

April 13, 2026 / 03:03 PM IST

‘ఆదర్శ కుటుంబం’ కోసం స్పెషల్ సాంగ్?

వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తర్వాత.. ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. అంతేకాదు ఈ పాటలో మరో హీరోయిన్ కనిపిస్తుందట. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ నెగటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని టాక్.

April 13, 2026 / 02:48 PM IST

మృణాల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మే 22న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మృణాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

April 13, 2026 / 02:20 PM IST

‘తలైవార్ 173’ నుంచి డైరెక్టర్ అవుట్..?

కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి దర్శకుడు సిబి తప్పుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఆ బాధ్యతలు ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరిముత్తుకు దక్కే అవకాశం ఉందట. ఇటీవల రజినీకి అశ్వత్ వినిపించిన కథ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకా...

April 13, 2026 / 02:08 PM IST

ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

ఏప్రిల్ 15న ‘పళ్లి చట్టంబి’.. ఏప్రిల్ 17న ‘పాపం ప్రతాప్’, ‘తిమ్మరాజుపల్లి TV’, ‘బ్యాడ్‌ బాయ్ కార్తీక్’, ‘తెరచాప’ మూవీలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అలాగే ‘భూత్ బంగ్లా’ ఏప్రిల్ 17న విడుదల కానుండగా, ఏప్రిల్ 16న ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నారు. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 16న ‘ఉస్తాద్ భగత్ సి...

April 13, 2026 / 01:43 PM IST

స్టైలిష్ లుక్‌లో రామ్‌ చరణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అంతర్జాతీయ గౌరవం అందుకున్నాడు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై తన స్టైలిష్ అండ్ రాయల్ లుక్‌తో మెరిశాడు. ‘RRR’ తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చరణ్, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. పవర్‌ఫుల్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఆయన ఫొటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

April 13, 2026 / 01:17 PM IST

‘ఇరుముగన్‌’ దర్శకుడితో విక్రమ్ మూవీ?

నటుడు విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఇరుముగన్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు ఆనంద్ శంకర్‌తో ఆయన మరోసారి చేతులు కలిపినట్లు తెలుస్తోంది. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం మునుపటి కంటే భిన్నంగా ఉండబోతుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విక్రమ్ అభిమానులు ఈ క్రేజీ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

April 13, 2026 / 01:06 PM IST

‘పెద్ది’లో సీనియర్‌ నటుడు ఎంట్రీ..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీలో సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ‘ఎవడు'(2014) చిత్రం తర్వాత దాదాపు 12 ఏళ్లకు రామ్ చరణ్, సాయి కుమార్ మళ్లీ కలిసి నటిస్తున్నట్లు అవుతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

April 13, 2026 / 12:28 PM IST

‘డెకాయిట్’ మూడు రోజుల కలెక్షన్స్

అడివి శేష్, దర్శకుడు షానీల్‌ డియో కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.40కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించాడు.

April 13, 2026 / 12:18 PM IST

నాగచైతన్య లైనప్‌లో రెండు భారీ ప్రాజెక్టులు!

యువసామ్రాట్ నాగచైతన్య రెండు భారీ చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, కింగ్ నాగార్జున కాంబోలో రాబోతున్న మూవీలో చైతు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను ‘బెదురులంక 2012’ ఫేమ్ దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో చేయనున్నాడట. ఈ రెండు ప్రాజెక్టులు అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.

April 13, 2026 / 12:11 PM IST

‘దేవర 2’లో మక్కల్ సెల్వన్..?

జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘దేవర’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ‘దేవర 2’లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఆయనను సంప్రదించారట. ఒకవేళ ఇదే నిజమైతే ‘దేవర 2’ రేంజ్ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

April 13, 2026 / 11:20 AM IST

‘రౌడీ జనార్ధన’ ఇంటర్వెల్‌కి సన్నాహాలు !

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా తెరకెక్కిస్తోన్న మూవీ ‘రౌడీ జనార్ధన’. ప్రస్తుతం దేవరకొండపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను వేస్తున్నారట. ఈ సెట్‌లో ఇంటర్వెల్ సన్నివేశాలను షూట్ చేస్తారట. అంతేకాదు ఇందులో నటుడు రాజశేఖర్ పాత్ర అండ్ లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు టాక్.

April 13, 2026 / 10:58 AM IST