• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సీఎం

TG: హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు అర్జున్ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్లను ఆయన పరిశీలించారు. ఇందులో 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కలిగి ఉండటం విశేషం.

March 12, 2026 / 08:29 PM IST

నా వ్యక్తిగత జీవితంపై జోక్యం అనవసరం: రష్మిక

SM ప్రచారాలపై నటి రష్మిక స్పందించింది. ఎనిమిదేళ్లుగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తన పాత ప్రైవేట్ ఆడియోను లీక్ చేశారని, తన కుటుంబం, స్నేహితుల ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో SM నుంచి ఆ కంటెంట్ తొలగించాలని హెచ్చరించింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. తన వ్యక్తిగత జీవితంపై ఇతరులు జోక్యం అనవసరమని పేర్కొంది.

March 12, 2026 / 05:08 PM IST

చిరు ‘MSVG’ సూపర్ TRP

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. OTT వేదిక జీ5లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ అయింది. తాజాగా వెల్లడైన TRP రేటింగ్స్‌లో ఈ సినిమా సత్తా చాటింది. అర్బన్‌లో 12.52 రేటింగ్, అర్బన్ + రూరల్‌‌లో 10.35 రేటింగ్ సాధించింది.

March 12, 2026 / 04:50 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్.. సెన్సార్ టాక్ అదిరింది!

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెన్సార్ టాక్ సాలిడ్‌గా వచ్చినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే, సెకండ్ హాఫ్‌లో పవన్ పీక్ పర్ఫార్మెన్స్‌ కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్.

March 12, 2026 / 04:44 PM IST

ధనుష్ ప్రాజెక్టులపై నయా UPDATE

తమిళ హీరో ధనుష్ వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ‘D55’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. మమ్ముట్టి త్వరలోనే భాగం కానున్నాడు. ఈ మూవీని SEP వరకు పూర్తి చేసి.. మారి సెల్వరాజ్‌తో ‘D56’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ‘D57’ సినిమా చేయనున్నట్లు, 2027లో ఇది స్టార్ట్ క...

March 12, 2026 / 04:15 PM IST

‘లవ్ జిహాద్’ విమర్శలపై మోనాలిసా ఫైర్

సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా, నిన్న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని కొందరు విమర్శిస్తుండటంతో మోనాలిసా ఘాటుగా స్పందించింది. తన వివాహానికి ‘లవ్ జిహాద్’ అని ముద్ర వేయవద్దని కోరింది. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని స్పష్టం చేసింది.

March 12, 2026 / 03:56 PM IST

OTTలోకి వచ్చేసిన ‘మేడిన్ కొరియా’

నటి ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రా.కార్తిక్ తెరకెక్కించిన మూవీ ‘మేడిన్ కొరియా’. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ డ్రామాలు, సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. కాగా, ఇందులో దక్షిణ కొరియా వెళ్లాలనే లక్ష్యం ఉన్న అమ్మాయిగా ప్రియాంక నటించింది.

March 12, 2026 / 03:50 PM IST

పెళ్లిలో అన్నయ్య ఇచ్చిన సలహా అదే: అల్లు శిరీష్‌

నయనికతో పెళ్లి తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ తన అన్నయ్య అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి చెప్పాడు. ‘పరిస్థితులు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఫంక్షన్‌లో డ్రెస్సులు సరైన సమయానికి రాకపోవచ్చు. ఆలస్యం కావొచ్చు. ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడికి లోనవ్వద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు, ఏమీ ఆలోచించకుండా పెళ్లిని ఎంజాయ్ చేయి’ అని బన్నీ చెప్పినట్లు తెలిపాడు.

March 12, 2026 / 03:41 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు?

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించాలని, సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా పెంచుకోవాలని కోరినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

March 12, 2026 / 03:20 PM IST

విజయ్ ‘జననాయగన్’కు భారీ షాక్

TVK పార్టీ అధినేత విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు మరో భారీ షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ ఒప్పందాన్ని అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకుంది. సెన్సార్ వివాదాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందన్న కారణంతో ఆ సంస్థ ఈ డీల్ నుంచి తప్పుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ రూ.120 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసింది.

March 12, 2026 / 03:17 PM IST

ఈ శుక్ర‌వారం బోసిపోనున్న థియేట‌ర్స్!

టాలీవుడ్‌లో ఈ వారం సందడి లోపించింది. మార్చి రెండో వారంలో ఒక్క కొత్త సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. గత వారం వచ్చిన మూవీలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో థియేటర్ల వద్ద జనం తగ్గారు. దీంతో పాత సినిమాలే తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి 19న ఉగాది సందర్భంగా రానున్న భారీ సినిమాలపైనే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ ఉన్నాయి. అప్పటివరకు బాక్సాఫీస్ వెలవెలబోనుంది.

March 12, 2026 / 03:10 PM IST

‘ధురంధర్’ యాక్షన్ మోడ్ షురూ!

మార్చి 19న ‘ధురంధర్ 2’ రిలీజ్ కానున్న నేపథ్యంలో పార్ట్-1 రీ-రిలీజ్‌తో థియేటర్లలో రచ్చ మొదలైంది.  ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇండియాలో ఈరోజే (మార్చి 12) 250 థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయింది. ఓవర్సీస్‌లోని థియేటర్లలో రేపటి నుంచి ఈ మూవీ మరోసారి సందడి చేయనుంది.

March 12, 2026 / 02:59 PM IST

బిగ్‌బాస్ విన్నర్‌కు షాక్

హిందీ బిగ్‌బాస్‌ 19 విజేత గౌరవ్‌ ఖన్నాకు ఇంకా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ.. షో ముగిశాక నగదు చేతికి రావడానికి ఇంటర్నల్ ఆడిట్స్, పేపర్ వర్క్ వంటి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని తెలిపాడు. టీవీ రంగంలో పేమెంట్స్ 1-2 నెలలు ఆలస్యం కావడం సహజమేనని, తన డబ్బులు కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.

March 12, 2026 / 02:32 PM IST

‘డెకాయిట్’: రీమిక్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ

‘డెకాయిట్’లో ‘కన్నెపిట్టరో’ రీమిక్స్ వివాదంపై నిర్మాత సుప్రియ స్పందించింది. ఈ పాట హక్కులు ఆదిత్య మ్యూజిక్ వద్ద ఉన్నాయని, వారి నుంచి అధికారిక అనుమతి తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. సంగీత దర్శకుడు కోటిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటంతో వివాదం సద్దుమణిగిందని తెలిపింది. సంగీత దర్శకుడు గ్యాని ఈ పాటను అద్భుతంగా రీమిక్స్ చేశారని, ఇది మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పింది.

March 12, 2026 / 02:12 PM IST

యంగ్ హీరోయిన్లపై ఖుష్బూ కామెంట్స్

యంగ్ హీరోయిన్ల ప్రతిభపై సీనియర్ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి నటీమణులు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారని, సెట్స్‌కు రాకముందే మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విషయాల్లో పూర్తి హోంవర్క్ చేసుకుంటున్నారని కొనియాడారు. వారి ప్లానింగ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, నిజానికి సీనియర్లమే వారి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె ప్రశంసించారు.

March 12, 2026 / 01:40 PM IST