సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా, నిన్న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని కొందరు విమర్శిస్తుండటంతో మోనాలిసా ఘాటుగా స్పందించింది. తన వివాహానికి ‘లవ్ జిహాద్’ అని ముద్ర వేయవద్దని కోరింది. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని స్పష్టం చేసింది.