తమిళ గిల్లి సినిమా తెలుగులో పోకిరికి రీమేక్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మికా మందన్న చెప్పారు. తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా గిల్లి అని, అందులో ఓ పాట తనకెంతో ఇష్టమని తెలిపారు. అయితే ఆ సినిమా మహేష్ బాబు నటించిన ఒక్కడుకి రీమేక్ కావడంతో నెటిజన్లు రష్మిక వీడియోను వైరల్ చేశారు. ఈ విషయంలో సారీ చెబుతూ రష్మిక సరదా పోస్ట్ పెట్టారు. ‘అవును గిల్లి ఒక్కడుకి రీమేక్. ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా.. [&...
ఈ ఏడాది టాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాలు చాలా వచ్చాయి. సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, నారా రోహిత్ ‘ప్రతినిధి-2’, అంజలి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, శ్రీసింహా ‘మత్తు వదలరా-2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాలతో పాటు ఇతర భాషల్లో కమల్ ‘ఇండియన్-2’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’ వచ...
దర్శక దిగ్గజం రాజమౌళికి తమిళ డైరెక్టర్ అట్లీ పోటీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అట్లీ ‘అవుట్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ తన 6వ సినిమాను ప్రకటించారు. ఈ క్రమంలో రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సవాల్ విసిరేలా ఈ చిత్రం వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లను తీసుకువస్తున్నారట. రాజమౌళి సినిమా కంటే ముందు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్ల...
‘అమరన్’ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందీలో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ మూవీని భూషణ్ కుమార్ నిర్మించనున్నారట. ఈ మేరకు వీరిద్దరి మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
విలన్ పాత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫతేహ్ జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూ అరుంధతి సినిమాలోని పశుపతి క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లోనే బాగా కష్టపడ్డ పాత్ర అని అన్నాడు. మేకప్‌కే ఆరేడు గంటలు పట్టేదన్నాడు. మేకప్ ద్వారా దద్దుర్లు వచ్చాయని వెల్లడించాడు.
‘పుష్ప-2’ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తోన్న విషయం తెలిసిందే. అలాంటి వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ తాజాగా స్పందించింది. సినిమా ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. థియేటర్‌లో విడుదలైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని.. ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేసింది.
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇవాళ OTTలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇవాళ OTTలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. హిందీ బాక్సాఫీసు వద్ద రూ.632 కోట్లు (నెట్) దక్కించుకొని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన 15 రోజుల్లోనే అంత మొత్తాన్ని కలెక్ట్ చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ నుంచి అప్‌డేట్ వచ్చింది. రామ్ చరణ్ ఫొటోతో ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈనెల 29న విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
మెగాస్టార్ చిరంజీవిపై యాక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1982లో చిరు, మోహన్‌బాబు కలిసి నటించిన చిత్రం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ గురించి పలు విషయాలను పంచుకున్నారు. ‘నా స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం వల్ల ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది’ అని పోస్ట్ ...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘NKR21’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ నటిస్తున్నారు. ఇవాళ సోహైల్ బర్త్ డే సందర్భంగా.. మేకర్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది.
తన తల్లిదండ్రులు మోనా కపూర్, బోనీకపూర్ విదాకులపై నటుడు అర్జున్ కపూర్ తాజాగా స్పందించాడు. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్లిద్దరూ విడిపోయారని.. అది తననెంతో బాధించిందని అన్నాడు. నాన్న చేసిన పనికి ఆయన హ్యాపీగా ఉన్నంతకాలం తాను ఏవిధంగాను ఇబ్బందిపడనని చెప్పాడు. కాగా, మోనా కపూర్‌తో విడాకుల అనంతరం బోనీకపూర్ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఇండియన్ 2’ మూవీ పరాజయం పొందింది. దీంతో ‘ఇండియన్ 3’ థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో రిలీజ్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ దర్శకుడు శంకర్.. ‘ఇండియన్ 3’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ తప్పకుండా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్...