పుష్ప-2లో ఓ డైలాగ్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ‘ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్! ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’ అని అల్లుఅర్జున్ డైలాగ్ చెబుతాడు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డైలాగ్ సినిమాలో అవసరమా? అని చర్చించుకుంటున్నారు. మరి మీరేమంటారు..?
TG: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప-2 మూవీని ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంవల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా, ఆమె కుమారుడు మరణించిన విషయం తెలిసిందే.
AP: అల్లుఅర్జున్ అభిమానులకు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని ఓ థియేటర్ ఉచితంగా టికెట్లు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్ని చోట్లా రూ.వేలల్లో టికెట్లను విక్రయించగా.. జీ7 మినర్వా థియేటర్ ఉచితంగా టికెట్లు ఇచ్చింది. ఏకంగా బుక్ మై షోలోనే ఫ్రీ టికెట్లను పంపిణీ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమాలకు నిలయమైన ప్రసాద్ మల్టీప్లెక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమా వస్తుందంటే.. ఆడియన్స్, నెటిజన్స్, రివ్యూవర్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ వైపే చూస్తారు. అయితే దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప-2’ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రదర్శించలేదు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మధ్య తలెత్తిన వివాదం కారణంగానే పుష్ప-2 మూవీ.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో రిలీ...
పుష్ప-2 సినిమా విడుదల నేపథ్యంలో అల్లుఅర్జున్ కుమారుడు అయాన్ రాసిన లెటర్ వైరల్ అవుతోంది. ‘ఈ రోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి మూవీ రిలీజ్ అయింది. నాకు చాలా ప్రత్యేకం. పుష్ప-2 కేవలం సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న ప్రేమను తెలియజేస్తుంది. నా జీవితంలో నువ్వే ఎప్పటికీ హీరో. నీకున్న కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకడిని’ అంటూ రాసిన అయాన్ లేఖను అల్లు అర్జున్ ట్విట్టర్లో పోస్టు చేసి.. రి...
తెలుగురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పుష్ప-2 జాతర నడుస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేసినా.. పుష్ప-2 మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్‌యే దర్శనమిస్తున్నాయి. అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూపించాడని అభిమానులు ఖుషీ అవుతున్నారు. #WILDFIREPUSHPA హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే పుష్ప-2 మూవీ మీరు చూశారా..? మరి మీకేలా అనిపించిందో కామెంట్ చేయండి..?
పుష్పరాజ్.. సాధారణ కూలీ జీవితం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫీయాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది పుష్ప-2లో చూపించారు. కథపై కాకుండా ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు డైరెక్టర్. బన్నీ నటవిశ్వరూపం చూపించాడు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనేది సినిమా. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ బాగుంటుంది. జాతర ఎపిసోడ్ అదిరిపోయింది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. విలనిజంలో బలం లేదు....
పుష్ప 2 రిలీజ్‌కు ముందు నటుడు నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ’24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా.. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…అందరిని అలరించే సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
TG: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఇద్దరు అభిమానులు, మహిళ, ఓ బాలుడు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
జీ తెలుగు: దువ్వాడ జగన్నాథమ్ (9AM), గీతా.. ఛలో (11PM); ఈటీవీ: మాయాపేటిక (9AM); జెమినీ: దొంగోడు (8.30AM), అజ్ఞాతవాసి (3PM); స్టార్ మా: జయ జానకి నాయక (9AM); స్టార్ మా మూవీస్: తూటా (7AM), మిడ్‌నైట్ మార్డర్స్ (9AM), రంగస్థలం (12PM), కర్తవ్యం (3:30PM), ఫిదా (6PM), అదుర్స్ (9PM); జీ సినిమాలు: త్రిపుర (7AM), స్టూడెంట్ నెం 1 (9AM), లింగ (12PM), బలుపు (3PM), కాంచన 3 (6PM), తడాఖా (9PM).
హీరో అక్కినేని నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికైంది. ఇరు కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, టీ సుబ్బిరామి రెడ్డి, రానా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకులు కళ్యాణ్ కృష్ణ, శశికిరణ్, చందు మొండేటి తదితరులు హాజరయ్యారు.
టాలీవుడ్ హీరోలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా, బెల్లకొండ సాయి శ్రీనివాస్ కూడా వివాహానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఆయన విహహం జరగనున్నట్లు శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. శ్రీనివాస్ వివాహం పెద్దల అంగీకారంతోనే జరుగుతుందని, దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా, శ్రీనివాస్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ఈన...
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ సినిమాకు కర్ణాటకలో షాక్ తగిలింది. బెంగళూరులో ‘పుష్ప-2’ మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలో ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పవన్ వాడిన ‘సీజ్ ద షిప్’ పదం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి చెందిన ‘ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ’ నిర్మాణ సంస్థ తాజాగా సీజ్ ద షిప్ అనే టైటిల్‌ను రూ.1,100కు రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఏడాది పాటు టైటిల్ హక్కులు వర్తించ...
బాలీవుడు హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రైడ్’. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్వీక్వెల్‌గా ‘రైడ్-2’ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 2025 మే 1న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రితేష్ దేశ్‌ముఖ్,...