ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. నూతన వధూవరులు నాగ చైతన్య, శోభితతో కలిసి కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం చేశారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు అక్కినేని కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు.
15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేశ్ సిద్ధమవుతున్నారు. కాగా, తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్, ఆమె హిందూ కాబట్టి.. రెండు మతాలను గౌరవిస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈ నెల 12న గోవాలో జరగనుంది. ఉదయం హిందూ మత సంప్రదాయం ప్రకారం.. అదే రోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోన...
‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హీరోలు అలాంటి టైంలో వెళ్లడం కరెక్టేనా అని నిలదీశారు. ఘటనపై హీరో కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని హీరో, ప్రొడ్యూసర్స్ ఆదుకోవాలని.. బాధితులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అన్ని చర్యలు తీసుకుంటామని స్ప...
పుష్ప-2 మూవీలో చూపించిన గంగమ్మ జాతర.. తిరుపతిలో మేలో జరుగుతుంది. ఈ జాతరలో మగవాళ్లు అనేక గెటప్స్ వేసుకుంటారు. రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. ఆ సమయంలో తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ అనే మహిళ వెంటాడింది. ఆమెకు భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని.. వివిధ వేషధారణలతో బయటకి రప్పించి గంగమ్మ చంపేసింది. అప్పటి నుంచి గంగమ్మను శక్తిస్వరూపంగా భావించ...
బాహుబలి ప్రాంఛైజీ నిర్మాత శోభు యార్లగడ్డ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయ్యిందని X ద్వారా షేర్ చేశారు. ‘నా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయబడింది. @WhatsApp నేను మరో 12 గంటలపాటు లాగిన్ అవ్వడానికి అనుమతి లేదు. నేను చాలాసార్లు తప్పు పిన్‌ని ఎంటర్ చేశాను. ఈ సమయంలో హ్యాకర్ నా కాంటాక్ట్‌లో ఉన్న చాలామందిని మోసం చేశారు. దయచేసి నా వాట్సాప్ సమస్యపై ఏదైనా చేయండి @Meta @WhatsAPP’కు ట్యాగ్ చేశారు. దీన...
హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఓ కార్యక్రమానికి పాల్గొనడానికి గురువారం వచ్చిన ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. మీరు కథ సిద్ధం చేస్తే చేస్తానని బదులిచ్చారు. ఊహించనిది చేయడమే తన నైజమని బాలయ్య చెప్పారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న థియేటర్లలో విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. స్టోరీ బాగున్నా అనుకున్న స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. దేశంలోనే రెండో భారీ డిజాస్టర్ మూవీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా త్వరలో ఓటీటీలో అడుగుపెడుతోంది. డిసెంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
TG: హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ఘటనపై ఓ వ్యక్తి NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. సిటీ పోలీస్ యాక్ట్ కింద.. ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పుష్ప-2 ప్రీమియర్ షోకు అల్లుఅర్జున్ రావడంతో.. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
రామ్ పోతినేని హీరోగా మహేశ్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘Rapo22’. ఇందులో రామ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్.. సాగర్‌గా కనిపించనున్నాడు. కాగా.. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
TG: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు. దీంతో భారీ సినిమాలకు దెబ్బ పడనుంది. అయితే, ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’. అయితే ఈ సినిమాపై రిషబ్ శెట్టి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి చెప్పగానే క్షణం కూడా ఆలోచించలేదని రిషబ్ చెప్పారు. ఛత్రపతి శివాజీ రియల్ హీరో అని అన్నారు. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
అల్లుఅర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ఈ సినిమా బాలీవుడ్‌లోనూ చరిత్ర సృష్టించింది. తొలి రోజు రూ.67కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. కాగా, జవాన్ సినిమా 65.5 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉండగా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా బాలీవుడ్‌లో ఫస్ట్ డే కలెక్షన్స్‌లో 13వ స్థానంలో ఉంది.
పుష్ప-2 సినిమాను రష్మిక మందాన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది. ఈ మేరకు విజయ్ తల్లిదండ్రులతో పాటు ఆనంద్ దేవరకొండతో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. పుష్ప-2లో రష్మిక.. శ్రీవల్లిగా సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా, విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది.
అంచనాలకు తగ్గట్లుగానే పుష్ప-2 సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రీ సేల్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.175కోట్ల వసూళ్లు రాబట్టింది. కాగా, అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 తెరకెక్కిన విషయం తెలిసిందే.