తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఊర మాస్ ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
TG: మోహన్‌బాబు గురువారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని జల్‌పల్లి నివాసంలో మోహన్‌బాబు, మనోజ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్‌పల్లి నివాసం దగ్గర ప్రైవేటు వ్యక్తులను అనుమతించడంలేదు. అయితే విష్ణు మాత్రం ఇంకా అక్కడికి రానట్లు తెలుస్తోంది. విష్ణు ప్రస్తుతం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమాపై బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రివ్యూ ఇచ్చారు. మూవీ అద్భుతంగా ఉందని, అల్లు అర్జున్ ప్రదర్శన మరో స్థాయిలో ఉందని తెలిపారు. భార్యాభర్తల మధ్య సన్నివేశాలను ‘పుష్ప 2’లో చక్కగా చూపించారని, ఇలాంటి సీన్స్ బాలీవుడ్‌లో తెరకెక్కించాల్సి వస్తే కావాల్సినంత అశ్లీలత పెడతారని వెల్లడించారు. దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ ఎంతో నేర్...
హీరో గోపీచంద్‌తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
హీరో గోపీచంద్‌తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2:40 గంటల నిడివితో ఇది విడుదల కానున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మెకానిక్ రాకీ’ మంచి హిట్ అందుకుంది. ఈ యాక్షన్ కామెడీ మూవీ సైలెంట్‌గా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హరికథ’. మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తెరకెక్కించిన ఈ సిరీస్ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌తో బన్నీ భేటీ అయ్యారన్న వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అల్లుఅర్జున్ టీమ్ స్పందించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని పేర్కొంది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తొలిసారి తన కుమార్తె క్లీంకార ఫొటోను షేర్ చేశారు. ముత్తాత(ఉపాసన తాతయ్య), తాతయ్య(ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో క్లీంకార పాల్గొనట్లు తెలిపారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ.. క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘జాతర సీన్ ఇంత బాగా చేయగలిగిన ఏకైక హీరో బన్నీ సర్ మాత్రమే. ఇంత దమ్మున్న హీరో చీర కట్టుకొని డ్యాన్స్ చేసిన సీన్, డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. నా జీవితంలో మళ్లీ ఇలాంటి సీక్వెన్స్ చూస్తాననుకోవడం లేదు. సినిమాలో 21 నిమిషాల పాటు ఆయన చీర కట్టుకొనే కనిపిస్తాడు. అసలు ఏ మగాడు చేయగలడు చెప్పండి’ అని రష్మిక అనడం...
రౌడీ బేబి సాయి పల్లవి తప్పుడు వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రామాయణం’ సినిమా కోసం శాకాహారిగా మారారు అంటూ వస్తున్న రూమర్ల పై ఆమె ఘాటుగా స్పందించారు. ”మౌనంగా ఉన్నానని ఇష్టం వచ్చింది రాస్తే ఊరుకునేది లేదు.. ఇంకోసారి నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే ఎవరైనా సరే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బాలయ్య హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి పాటలను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ సాంగ్‌ను ఈనెల 14న ఉ.10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించేందుకు హస్తినాకు పయనమయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పుష్పరాజ్ తన తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ఎంత అందమైన ఉదయం.. బిగ్ డే.. అందమైన ప్రారంభం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.