సీనియర్ నటి రాధికా ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ కోలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం తొలి వారంలోనే సుమారు రూ.25 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ‘పసుపు తాయి’గా రాధికా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆమె ప్రోస్థటిక్ మేకప్ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.