రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఏ జట్టు అని కూడా చూడకుండా అన్నింటిపై తన అధిపత్యాన్ని వైభవ్ చూపించాడు. ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.