శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ పలాసలో పర్యటించనున్నారు. ఉదయం నూతన రైల్వే జోన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం పలాస రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.