MDK: మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామంలో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి తప్పిపోయిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి మల్లమ్మ పెద్ద కొడుకు రాజు మతిస్థిమితం సరిగా లేక గత 10 సంవత్సరాలుగా ఇంటివద్దే ఉంటున్నాడు. మే 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆదివారం రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.