VSP: పీఎం-సేటూ కింద విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు ఆమోదం లభించడం రాష్ట్రానికి గర్వకారణమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రూ.200.21 కోట్లతో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 5 ఏళ్లలో 25 వేల మందికి పైగా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.