KRNL: ఇటీవల పదోన్నతి పొందిన ఇద్దరు ఎంపీడీవోలకు మండలాలను కేటాయిస్తూ ఆదివారం జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మద్దికెర ఎంపీడీవోగా కేవీ నాగేంద్రప్రసాద్, హొళగుంద ఎంపీడీవోగా సయ్యద్ ఉమర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారికి జడ్పీ ఛైర్మన్, సీఈవో రమణారెడ్డి నియామక పత్రాలు అందజేశారు. విధుల్లో మంచి పేరు సంపాదించాలన్నారు.