AP: గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పన్ను వసూళ్లు సరిగా లేకపోవడంపై చర్చించారు. గ్రామ పంచాయతీల్లో పన్నులు సకాలంలో వసూళ్లు చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.