KRNL: నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటన వెనుక YCP కుట్ర ఉందని సోమవారం మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. నిందితుడు వైసీపీ అనుచరుడేనని ఫోటో ఆధారాలు విడుదల చేశారు. ఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.