KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో జిల్లా నాయకులు వీరశేఖర్, మల్లయ్య మాట్లాడుతూ.. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఖరీఫ్‌కు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలన్నారు.