TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో సోమవారం 12వ మలుపు వద్ద బస్సు, వ్యాన్ స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.