ప్రకాశం: చీమకుర్తి (M)లోని వీరభద్ర మినరల్స్ గ్రానైట్ వారిలో సోమవారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి కొన్ని వివరాలను అధికారులు సేకరించారు. ఇటీవల శివప్రసాద్ రెడ్డి క్వారీలను కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీకి చెందిన వారి గ్రానైట్ క్వారీలను అధికారులు ఉద్దేశపూర్వకంగా తనిఖీలు చేస్తున్నారని వారు ఆరోపించారు.