BHNG: మోత్కూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్గా గోల్కొండ నరసయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కే. సతీష్ కుమార్ హుజూర్నగర్ మున్సిపాలిటీకి బదిలీ కావడంతో ఆయన స్థానంలో నరసయ్య నియమితులయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.