MDK: జిల్లాలో జూన్ 1 నుంచి 12 వరకు నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్షించారు. మొక్కలు నాటడం, అవగాహన ర్యాలీలు, స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలన్నారు. అనంతరం గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.