ప్రకాశం: ఒంగోలు (M) ఈతముక్కల వెంకటేశ్వర యానాది కాలనీలో సోమవారం రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. స్మశాన వాటికలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలు చేసేందుకు మరో వర్గం అడ్డుకుంది. దీంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. 15 సం నివాసం ఉంటున్న తమ ప్రాంతంలో అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకోమని ఓ వర్గం తేల్చి చెప్పింది.