ADB: బోథ్‌లోని పట్నాపూర్ గ్రామపంచాయతీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయవాది శంకర్ అడవుల పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ, అటవీ హక్కుల చట్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. భావితరాల కోసం అటవీ సంపదను కాపాడాలని అధికారులు పిలుపునిచ్చారు.