AP: రాష్ట్రంలో 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన దస్త్రానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీన్ని త్వరలోనే క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. దీని వల్ల వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది.