JGL: మల్యాల గ్రామ పరిధిలోని సూరప్ప చెరువు FTL పరిధిలో షెడ్ నిర్మాణం జరుగుతుందని గంగపుత్ర సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం గ్రామ పంచాయతీ ఈవో శ్రీకాంత్, సర్పంచ్ జయకు వినతిపత్రం అందజేశారు. నిర్మాణాన్ని వెంటనే ఆపాలని, లేదంటే ఈ చర్యను ఆసరాగా చేసుకుని మరికొందరు ఆక్రమణలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువులను కాపాడి జీవనోపాధికి సహకరించాలన్నారు.