TG: తెలంగాణలో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చేమో కానీ, అధికారంలోకి మాత్రం రాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు. మతపరమైన విభజన, మతం అనే పునాదిపైనే బీజేపీ నిలబడి ఉందని విమర్శించారు. భవిష్యత్తు కార్యచరణలో భాగంగా ఏదైన పార్టీతో పొత్తు ఉంటే 5 స్థానాల్లో, లేదంటే ఒంటరిగా 15 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.