ELR: జీలుగుమిల్లిలో సోమవారం భవన నిర్మాణ కార్మికులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లలిత కుమారి పాల్గొన్నారు. కార్మికులందరూ సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకుని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ-శ్రమ్, ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ పథకాలపై అవగాహన కల్పించారు.