MLG: తండ్రిని కోల్పోయిన మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. మల్లంపల్లికి చెందిన రాజేశ్వరరావు ఇటీవల వడదెబ్బతో మృతి చెందగా, ఆయన కుమారుడు సాంబశివరావుకు పదోతరగతి స్నేహితులు ఆర్థిక సహాయం అందించారు. మొర్రి రాజు, మహేందర్, నాగరాజు, సతీశ్, కిరణ్రాజ్, కార్తీక్, నత్తిరాజు తదితరులు కలిసి రూ.14 వేల నగదును అందజేసి కుటుంబానికి భరోసా కల్పించారు.