AP: రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో మునిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పుష్కరఘాట్ వద్ద స్నానం కోసం బావ, బావమరుదులైన శ్రీనివాస్, నూకరాజు దిగారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయి మరణించారు. మృతులు రాజమహేంద్రవరం యాదమ్మదిబ్బకు చెందిన గవర్నమెంట్ టీచర్ శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా సైపవరానికి చెందిన నూకరాజుగా గుర్తించారు. నూకరాజుకు ఇటీవలే పెళ్లైంది.