NRPT: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జూన్ 3న డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కీలక సమావేశానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ సాగర్ హాజరుకానున్నారు. కార్యకర్తలు అందరూ సకాలంలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.