AP: కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా లేరని YCP స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.