NTR: విజయవాడలో ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు వాహనదారుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాలతో, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పర్యవేక్షణలో కీలక కూడళ్ల వద్ద క్యూ ఆర్ కోడ్లతో దిశానిర్దేశక ప్లకార్డులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వాహనదారులు సులభంగా పార్కింగ్ ప్రాంతాలకు చేరవచ్చు.