NRPT: నారాయణపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం గాలులు, ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం పడింది. కొన్ని రోజులుగా ఎండల వేడిమితో ఇబ్బందులు పడిన ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఉదయం నుంచి ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి, ఆకాశం మేఘావృతమై వర్షం పడింది.