SRCL: నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఎస్టీ యువత, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల ఎస్టీ యువత యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9441174822 నంబర్‌ను సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు.