VSP: VIMS హాస్పిటల్ నూతన డైరెక్టర్‌గా డా. మన్మథరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఏఎంసీ జనరల్ సర్జరీ విభాగాధిపతిగా సేవలందించిన ఆయన, విమ్స్‌ను పీజీ కాలేజీతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. క్యాథ్ ల్యాబ్, స్టాండ్అలోన్ పీజీ కాలేజీ ప్రతిపాదనల ఆమోదానికి కృషి చేస్తానని తెలిపారు.