జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 16 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీలను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధితులకు వేగంగా న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.