KMM: నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ పోరాటం అగ్నికణంగా ఎగిసి పడిందని పేర్కొన్నారు.