MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరి రైల్వే గేట్ నెంబర్ 83 వద్ద అండర్ పాస్ పనులు మూడేళ్లుగా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వెంకటగిరి గ్రామస్థులు కౌకుంట్ల ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఈ రవాణా కష్టాల నుంచి విముక్తి కల్పించాలని విన్నవించారు.