SRD: పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 1 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో పర్యావరణ అవగాహన, ప్రకృతి సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.