WGL: అధికారులు ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి సీపీ హాజరై బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సీపీ ఫోన్లో మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.