PPM: రాష్ట్ర రైతు విభాగం వైసీపీ సంయుక్త కార్య దర్శిగా జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాడేల మన్మథనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక పత్రం అందుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ డీసీఎం పాముల పుష్పశ్రీవాణి, జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు.