KMM: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పాలేరు, ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను విజయవంతం చేయాలని క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.