TG: ఆదిలాబాద్‌లోని ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యం ఆదిలాబాద్ జిల్లాకే ఇచ్చినట్లు చెప్పారు. ఆదివాసి తండాల్లో అధికంగా ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తండాల్లో నివసిస్తున్న వాళ్లందరికీ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.