ASR: ఒక నెలలో ఒక నియోజకవర్గం 4 సార్లు సందర్శనలో భాగంగా ఈనెల 3న అరకు నియోజకవర్గం హుకుంపేటలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నిశాంతి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు. హుకుంపేట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరై తమ సమస్యలను తెలిపాలని సూచించారు.