MDK: సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా మండలానికి 4 ప్రీ-ప్రైమరీ స్కూల్స్ మంజూరైనట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. ధర్మారం, కోనాపూర్, అక్కన్నపేట్, దామరచెరువు బడుల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట వస్తువులు, పెయింటింగ్స్, ఆయాల నియామకం ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వనియోగించుకుని పిల్లలను చేర్పించాలని కోరారు.