SRPT: ప్రజావాణిలో వచ్చే సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 103 దరఖాస్తులు అందాయని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి 57, డీపీవో, మున్సిపాలిటీలకు చొప్పున 6, ఇతర శాఖలకు మిగిలిన దరఖాస్తులను పరిష్కారం కోసం పంపినట్లు ఆయన పేర్కొన్నారు.