రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ షూటింగ్ హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ షూట్లో పాల్గొంటుండటంతో, తమ నయా పోలీస్ ఆఫీసర్‌ను చూడటానికి థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారట. ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగాయి.