ఆదిలాబాద్ పట్టణంలోని 18, 19 వార్డుకు చెందిన పలువురు నాయకులు, మహిళలు సోమవారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.